రాంచీ

రాంచీ: జార్ఖాండ్‌ ఎన్నికల ప్రచారంలో బీజేపీ లేవనెత్తుతున్న ‘చొరబాట్ల’ అంశంపై ఖర్గే నిప్పులు చెరిగారు. చొరబాట్ల పేరుతో ప్రతి ఒక్కరినీ బీజేపీ భయపెడుతోందని, కేంద్రంలో అధికారంలో ఉండగా చొరబాట్లను వారెందుకు ఆపలేకపోయారని నిలదీశారు. జార్ఖాండ్‌లోని జాంతారలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, చొరబాట్లదారుల పేరుతో ప్రజలను బీజేపీ భయపెట్టడాన్ని తప్పుపట్టారు. ”మీరే కేంద్రంలో ఉన్నారు. మీ ప్రధాని ఉన్నారు, మీ హోం మంత్రి ఉన్నారు. అలాంటప్పుడు చొరబాటుదారులు ఎక్కడి నుంచి వచ్చారు? చొరబాటుదారులు వస్తుంటే షా నిద్రపోతున్నారు కాబోలు” అని అన్నారు. కాషాయం పార్టీకి విడగొట్టడం మాత్రమే తెలుసునని విమర్శించారు.

Leave a Reply